దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన

ఏపీ డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటన ఖరారు అయింది.. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన పవన్ జ్వరం నుంచి కోలుకున్నారు..
దీంతో జనసేనాని ఈ నెల 12, 13, 14 తేదీల్లో కేరళ, తమిళనాడులో పలు ఆలయాలను సందర్శించ నున్నారు.. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కల్యాణ్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ పర్యటనలో అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుస రామస్వామి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
