మంచు మనోజ్ పై మోహన్ బాబు పిర్యాదు.?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఇంటిలో ఆస్తి గోడవలు బయటకు వచ్చిన సంగతి తెల్సిందే.. ఆస్తిలో వాటాలు అడిగినందుకు తన తండ్రి మోహాన్ బాబు పదిమందితో హీరో మనోజ్ పై దాడి చేయించారు అని సాయంత్రం మోహన్ బాబుపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు..
తాజాగా హీరో మోహాన్ బాబు హీరో మనోజ్,తన కోడలు పై పిర్యాదు చేశారు. తన కొడుకు మంచు మనోజ్, కోడలు మౌనికపై మోహన్‌బాబు రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు..
మనోజ్, మౌనిక నుంచి ప్రాణహాని ఉందని మోహన్‌బాబు తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోన్నారు.. అందుకే తనకు రక్షణ కల్పించాలంటూ రాచకొండ సీపీని మోహన్ బాబు కోరారు..