రోహిత్ శర్మకు మైకేల్ వాన్ సలహా..!

Michael Vaughan’s advice to Rohit Sharma..!
టీమిండియా కెప్టెన్.. ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఈ సీజన్ లో ఇప్పటి వరకూ ఆ జట్టుకు సరైన ఆరంభాల్ని అందివ్వలేకపోయారు. దీనిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ స్పందించారు.
ఆయన స్పందిస్తూ ‘రోహిత్ శర్మ ఐపీఎల్ లో ఆడేటప్పుడు ముంబై బ్లూ జెర్సీకి బదులు టీమ్ ఇండియా బ్లూ జెర్సీలో ఆడుతున్నట్లు భావించాలి. అప్పుడైతే రన్స్ చేస్తారేమో.
ఆయనలాంటి మంచి ప్లేయర్ వెనుకబడకూడదు. పరుగుల వరద పారించాలి. ఆయన సరిగ్గా ఆడకపోతే ముంబై ప్లే ఆఫ్కు చేరలేదు’ అని జోస్యం చెప్పారు.
