ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువతిని గర్భవతిని చేసిన కానిస్టేబుల్…

డబ్బుల విషయంలో కొందరు తనను ఇబ్బంది పెడుతున్నారని గత ఏడాది మార్చి 21న మేడ్చల్ పోలీసు స్టేషన్‌కు వచ్చిన యువతి.
న్యాయం చేస్తానని నమ్మించి గర్భవతిని చేసిన కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి.
కేసు విషయమై ఫోన్ చేసిన యువతిని లాయర్‌తో మాట్లాడుదామని ఇంటికి పిలిపించిన సుధాకర్.
తనకి పెళ్లి కాలేదని మాయ మాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడి.
అదే ఏడాది జూలైలో ఆమె గర్భం దాల్చగా, భయంతో యువతికి బలవంతంగా అబార్షన్ చేయించిన వైనం.
అగస్టులో సుధాకర్ కు పెళ్లైందని తెలిసి.. తాను మోసపోయానని గ్రహించి నిలదీసిన యువతి.
దీంతో యువతి అడ్డు తొలగించాలని సుధాకర్ నిర్ణయం.
ఈ మేరకు ఆమెపై పలు మార్లు దాడికి యత్నం.
ఈ నెల 3న కమిషనరేట్‌లో యువతి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు