జీహెచ్ఎంసీలో మేయర్ వర్సెస్ కమీషనర్..!

Gadwal Vijaya Laxmi
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, కమిషనర్ మధ్య వాగ్వాదం చోటుచేసు కున్నట్టు తెలిసింది. హైదరాబాద్ నగర ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ముందే నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, కమిషనర్ ఇలంబర్తీలు పరస్ప రం వాగ్వాదం చేసుకుంటూ.. ఒకరిపై ఒకరు ఫిర్యా దులు చేసుకున్నట్టు అధికా ర వర్గాల సమాచారం. రంజాన్ ఏర్పాట్లపై నిన్న మంగళవారం సచివాలయంలో ఓ సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశం అనంతరం వీరిద్దరి మధ్య ఈ వాగ్వాదం చోటుచేసుకుందని సమా చారం. గత కొంతకాలంగా నగర మేయర్ కి, కమిషనర్ కి మధ్య అ భిప్రాయభేదాలు చోటుచేసుకు న్నాయనేది చర్చ ఉండనే ఉంది.
నగరంలో చేపట్ట బోతున్న పథకాలు, మౌలిక వసతుల కల్పనపై ఇటీవల నగర కమిషనర్ ఇలంబర్తీ ప్రత్యేక ఫోకస్ పెట్టి.. నగరంలో పర్యటనలు చేపడుతున్నారు. దీంతో న గర మేయర్ కాస్తంత గుర్రుగా ఉన్నారనీ, తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పర్యట నలు చేపట్టడం, తాను చేస్తున్న సూచనలను కూడా కమిషనర్ పెద్దగా పట్టించుకోవడంలేదనేది జీహెచ్ ఎంసి ప్రధాన కార్యాలయంలో గుసగుసలు ఉండనే ఉన్నాయి. ఇటీవల వార్డుల్లో నగర మేయర్ పర్యటిస్తుండగా.. క మిషనర్ కూడా తమతో రావాలని ఆమె సూచించారు.
అందుకు కమిషనర్ సా నుకూలంగా స్పందిం చినా.. కొంత కమ్యునికేషన్ గ్యాప్ నేపథ్యంలో కమిషనర్ వెళ్ళలేదని, దీంతో మేయర్ కాస్తంత అసహనానికి లోనైనట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లోనే మంత్రి పొన్నం ప్రభాకర్ ముందు జరిగిన సమావేశంలో కమిషనర్ పై ఇన్చార్జీ మంత్రికి నగర మేయర్ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మేయర్ ఫి ర్యాదుకు ప్రతిఫిర్యాదు కమి షనర్ చేసినట్టు సమాచారం. ఇద్దరి మధ్య సమన్వ యం లేకపోవడంతో బల్దియాలో ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు తెరపైకి వస్తు న్నాయనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.