లక్ అంటే పచ్చళ్ల పాపదే..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఆలేఖ్య చిట్టి పికెల్స్ సిస్టర్స్ . ఈ పేరు సోషల్ మీడియాలో ఎంతగా ట్రోలింగ్ అయిందో తెల్సిందే. చికెన్ పికెల్స్ ధర ఎక్కువగా ఉందని అడిగిన ఓ కస్టమర్ ను ఆలేఖ్య సిస్టర్స్ తిట్టిన బూతుపురాణం ఆడియో సోషల్ మీడియాను షేక్ చేసింది.
దీంతో ఆలేఖ్య పికెల్స్ వ్యాపారం మూతపడింది. అయితే, వ్యాపారం మూతపడిన కానీ ఆలేఖ్య సిస్టర్స్ కు మాత్రం ఓ గొప్ప అవకాశం దక్కింది. వాళ్లలో ఒకరైన రమ్య కు సినిమాల్లో అవకాశం లభించింది. ప్రముఖ హీరో అశ్విన్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వచ్చిన వాడు గౌతమ్’ మూవీలో రమ్యకు చోటు దక్కింది .
ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కార్యక్రమంలో ఆ వేదికపై రమ్య తళుక్కుమన్నారు. దీంతో ఈ పచ్చళ్ల పాపకు ఆ చిత్రంలో పాత్ర దక్కినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తోన్నాయి. అయితే, ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా.. లేదా ఓ పాత్రలోన అనేది తెలియాల్సి ఉంది.
