సీఎం కాన్వాయ్ కి ప్రమాదం
సహజంగా మంత్రి రోడ్డుపైకి వస్తేనే ట్రాఫిక్ క్లియరెన్స్ ఇస్తారు. అలాంటిది సాక్షాత్తు రాష్ట్ర సీఎం రోడ్డుపైకి వస్తే మినిమమ్ ఉంటది కానీ కేరళ సీఎం పినరయి విజయన్ విషయంలో ఇందుకు భిన్నంగా ఓ సంఘటన జరిగింది.
అసలు విషయానికి వస్తే ముఖ్యమంత్రి విజయన్ కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. తిరువనంతపురం సమీపంలోని వామనపురంలో కాన్వాయ్ వెళ్తుండగా ఓ బైక్ అడొచ్చింది.
దీంతో కాన్వాయ్ ముందు వెళ్తున్న పోలీస్ జీప్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. వెనకే వస్తున్న మిగతా కార్లతో పాటు అంబులెన్స్ సైతం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ సమయంలో సీఎం కాన్వాయ్‌లోనే ఉన్నారు. అయితే ఆయన క్షేమంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.