ఆ ఒక్కటీ తప్పా దేనికైనా సిద్ధమంటున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor is a Bollywood beauty who is entering the Telugu film industry with the movie Devara
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న బాలీవుడ్ బ్యూటీ.. యువతకీ కలల రాణి జాన్వీ కపూర్..
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఉలఝ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది… ఈ సందర్భంగా హాట్ బ్యూటీ మాట్లాడుతూ కథ పరంగా మూవీ లో నా పాత్ర కోసం ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టమైన సరే నెత్తిన జుట్టు కత్తిరించను.. అది తప్పా ఏదైనా చేస్తాను “అని తేల్చి చెప్పింది..
ఆ పాత్ర నా మొత్తం సినిమా కేరెర్ ను మలుపు తిప్పే పాత్రలో కత్తిరించాల్సి వచ్చిన ఒప్పుకోను. ఒకవేళ ఆ పాత్రలో VFXలో మేనేజ్ చేస్తామంటే ఓకే. దీనికి కారణం మా అమ్మ శ్రీదేవి. మా అమ్మకు నా హెయిర్ అంటే చాలా ఇష్టం. దఢక్ మూవీ సమయంలో హెయిర్ కట్ చేస్తే తిట్టింది. ఏ పాత్ర కోసమైనా జుట్టు మాత్రం కత్తిరించుకోవద్దని సూచించింది’ అని ఈ హాట్ బ్యూటీ సంచలన కామెంట్స్ చేసింది..