యువతకు పెద్దపీట
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2024-25ఏడాది బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా యువతపై ఫోకస్ పెట్టారు అని అర్ధమవుతుంది .
అందులో భాగంగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదు పథకాలను కలిపి పీఎం ప్యాకేజీని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దీనికి రూ.2 లక్షల కోట్లను కేటాయించారు.
విద్య, ఉపాధి కల్పన, నైపుణ్య వృద్ధిపై దృష్టి సారిస్తారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.1.48 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. ఉపాధి రంగం ఏదైనా తొలి నెల వేతనం కింద రూ.15,000 నగదు బదిలీ ఇందులోకే వస్తుంది.