ఆ ఎమ్మెల్యేకి మంత్రి ఇవ్వకపోతే రేవంత్ ఔట్..!

CM Revanth Reddy
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించి దాదాపు పదిహేడు నెలలు కావోస్తుంది. అయితే ఇప్పటికి పూర్తి మంత్రివర్గ విస్తరణ జరగలేదు. హన్మంతుడి పెళ్లి ఎప్పుడంటే రేపన్నట్లు అదిగో మంత్రివర్గ విస్తరణ.. ఇదిగో మంత్రివర్గ విస్తరణ అంటూ అనుకూల మీడియాలో వార్తలు వైరల్ అవ్వడం తప్పా ఇంతవరకూ కొలిక్కి వచ్చినట్లు లేదు. అయితే రాష్ట్ర మంత్రివర్గంలో ముదిరాజు సామాజికవర్గానికి చోటు కల్పించలేదు.
త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే.. ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వాకాటి శ్రీహారి ముదిరాజుకు చోటు దక్కుతుందని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో ఓ వర్గం డామినేషన్ ఎక్కువైన సందర్భంలో శ్రీహారిని పక్కనెట్టే అవకాశాలున్నాయని ఇటు గాంధీ భవన్ లో అటు రాజకీయ వర్గాల్లో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన నేతలు తమ కులానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవివ్వకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీఎం కుర్చి నుండి దించుతాము.
తెలంగాణలో బీసీకులంలో ఎక్కువగా ఉన్నది మా వర్గమే. జనాభాలో మేము ప్రథమ స్థానం. ముఖ్యమంత్రి.. ఆయన సామాజిక వర్గానికి చెందిన మంత్రులకు ఓ హెచ్చరిక. మా వర్గం నుండి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే వాకాటీ శ్రీహారి ముదిరాజు. అతనికి మంత్రివర్గంలో చోటు కల్పించకపోతే మా ముదిరాజుల సత్తా ఏంటో చూపిస్తాము. మా ఎమ్మెల్యేకు మంత్రిపదవి రాకుండా మీరు మీ వర్గం వాళ్ళు అడ్డుపడుతున్నారు. శ్రీహారికి మల్లిఖార్జున ఖర్గే ఆశీస్సులున్నాయి.
మీ దయాదాక్షిణ్యాలతో ఎమ్మెల్యే సీటు రాలేదు. నువ్వు నీలం మధు ముదిరాజు తో వందకోట్ల బేరం ఆడి ఎమ్మెల్సీ ఆఫర్ చేశావు. మీ కథలన్నీ ఆధిష్టానానికి తెల్సి మీకు మొట్టికాయలు వేశారు.ఖబడ్ధార్ బిడ్డా ..? నీపలుకు బడి ఉపయోగించి మీ పవర్ ఉపయోగించి మావోడ్కి మంత్రిపదవి రాకపోతే మీ భరతం పడతాము అని హెచ్చారిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాశారు.
