చెన్నై ముందు భారీ స్కోర్…!

పంజాబ్‌లోని మొహాలి- మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ సాధించింది.
పంజాబ్ ఆటగాడు ప్రియాంశ్ ఏడు ఫోర్లు.. తొమ్మిది సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 39బంతుల్లో 103పరుగులు సాధించడంతో పూర్తి ఓవర్లలో 219పరుగులు చేసింది.
శశాంక్ సింగ్ (52*)పరుగులతో చివరి వరకూ క్రీజులో ఉన్నాడు. పంజాబ్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లల్లో ఖలీల్ ,అశ్విన్ చెరో రెండు వికెట్లను తీశారు. ముకేశ్,నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.
