చావడానికి సిద్ధమంటున్న హారీష్ రావు..?

former minister thanneeru harish rao
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ ప్రక్షాళనలో మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు సరైన న్యాయం చేయకుండా వాళ్లను అక్కడ నుండి తరలిస్తే సహించేది లేదు. పేద ప్రజల తరపున పోరాడుతున్న నాపై.. కేటీఆర్ లపై బుల్డోజర్లు పంపించి తొక్కిస్తాడంట..
పేద ప్రజల కోసం చావడానికైన సిద్ధం అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. మూడు నెలలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇండ్లలో ఉండమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. పేద ప్రజలకు న్యాయం జరుగుతుంటే మూడు నెలలు కాదు మూడు ఏండ్లు ఉంటాను.
దానికి రేవంత్ రెడ్డి సిద్ధమేనా అని ప్రశ్నించారు. మేము హైడ్రాకు.. మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. వాటి పేర్లతో పేదప్రజలకు చేస్తున్న అన్యాయంపైనే తమ పోరాటం తప్పా మాకు వ్యక్తిగత ఏజెండాలేమి లేవని పేర్కొన్నారు.