మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

రెండో రోజు ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీబడ్జెట్ సమావేశాల్లో మాజీ మంత్రి. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే గుంట్ల కండ్ల జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి.
అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తన ముందు ఎక్కువ మాట్లాడొద్దని ఆయన హెచ్చరించారు. స్పీకర్ కలుగజేసుకుని అసహనానికి గురి కావొద్దని సూచించారు.
దీంతో మాజీ మంత్రి జగదీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ సభలో మన అందరికీ సమానహక్కులున్నాయి. మా తరఫున పెద్దమనిషిగా అక్కడున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కాదు’ అన్నారు. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమనడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.