హిమాచల్ ప్రదేశ్ సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ!
హిమాచల్ ప్రదేశ్‌లో తెలంగాణ ప్రభుత్వం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు చేపట్టబోతుంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బూట్ బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్, విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు చేపట్టబోతుంది.
ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 100 మెగావాట్లకు పైగా కెపాసిటీ గల ప్రాజెక్టులు చేపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
గురువారం ఢిల్లీలో హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుతో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.400 మెగావాట్ల సెలి, 120 మెగావాట్ల మియర్ ప్రాజెక్టు లపై ఆసక్తి చూపుతోంది..
వీటిని చేపట్టేందుకు ఎంవోయూ సిద్ధం చేయాలని కోరారు. దానిని పరిశీలించి వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకునేలా తాను చర్యలు చేపడుతానని భట్టి హామీ ఇచ్చారు.