ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరులు ..!

Former Congress MLA to enter films..!
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల వరకూ అందరి ఆగడాలకు అడ్డు అదుపు లేదు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. కాంట్రాక్టు బిల్లుల్లో ముప్పై శాతం కమీషన్ తీసుకుంటున్నారు ఒక పక్క ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోపక్క పైసలు లేకుండా మంత్రులు ఫైళ్లు క్లియరెన్స్ చేయరు అని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానిస్తారు.
ఇంకో పక్క మా పని అయిపోయింది. మీ రాజ్యం నడుస్తుంది. మీరే ఏలండి అని ఫిరాయింపు నేత.. ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఫిరాయింపు నేతలపై కాంగ్రెస్ నేత .. సీనియర్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తారు. ఇవన్నీ చాలవంటూ తాజాగా ఓ ఎమ్మెల్యే అనుచరుల బాగోతం వెలుగులోకి వచ్చింది. రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఓ స్థానిక ఎమ్మెల్యేకు చెందిన అనుచరులు రూ పది కోట్ల విలువ చేసే సర్కారు భూమిని కబ్జా చేసి లేఅవుట్లుగా మార్చి విక్రయిస్తున్నారు.
అక్కడితో ఆగకుండా కబ్జా చేసిన ఆ భూమికి మల్ రెడ్డి రంగారెడ్డి కాలనీ అని ఏకంగా సదరు ఎమ్మెల్యే పేరునే పెట్టారు ఆ ప్రబుద్ధులు. హైదరాబాద్ పట్టణ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని బాటసింగారం గ్రామంలో 10/95 సర్వే నెంబర్లో ఉన్న ఎకరం ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, రెవెన్యూ అధికారులకు అనుమానం రాకుండా కేవలం పేపర్ పైనే లేఔట్ చేసి ప్రజలను మోసం చేస్తూ ఒక్కో ప్లాటుకు రూ.3 లక్షలు వసూలు చేశారని, ప్రభుత్వ భూమి అని తెలియక డబ్బులు చెల్లించి మోసపోయామని ఆవేదనను బాధితులు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ బాధితులకు ఎంతవరకూ న్యాయం జరుగుతుందో..!
