సీఎం చంద్రబాబు కు భారీ ఊరట
Chandrababu Naidu Chief Minister of Andhra Pradesh
![]()
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది.
గతంలో అధికార పార్టీ అయిన వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్ ను రద్ధు చేయాలని వేసిన పిటిషన్ ను కొట్టివేసింది.
జస్టీస్ బేలా ఎం త్రివేథి ధర్మాసనం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. కాగా స్కిల్ కేసులో 2023 నవంబర్ నెలలో చంద్రబాబు నాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ ను రద్ధు చేయాలని గత వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.