Big Breaking News- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..!

Big Breaking News- Former BRS MLA arrested..!
శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
గతంలో పంజాగుట్ట ప్రజాభవన్ ( ప్రగతి భవన్ ) దగ్గర జరిగిన కారు యాక్సిడెంట్ కేసులో తన తనయుడ్ని అప్పటి అధికారాన్ని .. ఎమ్మెల్యే గిరిని అడ్డుపెట్టుకుని తప్పించారనే పంజాగుట్ట పీఎస్ లో మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
అప్పటి నుండి ఆయన అడ్రస్ లేరు. తాజాగా షకీల్ మాతృమూర్తి మరణించడంతో అంత్యక్రియలకు హజరు కావడానికి రాష్ట్రానికి తిరిగి వచ్చారు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
