అల్లు అర్జున్ పై బిగ్ బి షాకింగ్ కామెంట్స్..!
తనకు బిగ్ బి అంటే ఎంతో అభిమానమని, ఇప్పటికీ ఆయనే తనకు స్ఫూర్తినిస్తుంటారని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
దీనిపై బాలీవుడ్ స్టార్ హీరో..బిగ్ బి అమితాబ్ స్పందించారు. బిగ్ బి స్పందిస్తూ ‘అల్లుఅర్జున్.. మీ మాటలకు చాలా కృతజ్ఞుడ్ని. నా అర్హత కంటే ఎక్కువగా చెప్పారు.
మీ పని & ప్రతిభకు మేమంతా పెద్ద అభిమానులం. మీరు మా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉండండి. మీకు మరిన్ని సక్సెస్లు రావాలని ప్రార్థిస్తున్నా’ అని ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు.