బాబు యాక్షన్ -ఈసీ రియాక్షన్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి…టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యాక్షన్ కు ఈసీ రియాక్షన్ చూపింది..
రేపు శనివారం పద్దెనిమిదో తారీఖు నుండి ఈ నెల ఇరవై ఐదు తారీఖు వరకు అన్ని శాఖాల్లో జరగనున్న ఈ ఆఫీస్ అప్ గ్రేడ్ కార్యక్రమాన్ని ఆపాలని..అప్ గ్రేడ్ వల్ల ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఫైళ్ల భద్రతకు ముప్పు ఉందంటూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈసీకి లేఖ రాసిన సంగతి తెల్సిందే.
దానిపై స్పందించిన ఈసీ మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ ప్రక్రియను ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది.. అయితే ప్రస్తుతం ఉన్న వెర్షన్ లోనే విధులు నిర్వహించాలని అన్ని శాఖల HODలను ఆదేశించారు. కొత్త షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామన్నారు.