Andhra Pradesh Slider

బాబుకు భద్రత పెంపు.. ఎందుకంటే…?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి…తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది.. చంద్రబాబు కు 12*12ఎస్పీజీ వైట్ కమాండోలతో కూడిన భద్రత సిబ్బందితో రక్షణ కల్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వులల్లో పేర్కోంది. అయితే రెండు షిప్ట్ లుగా వీళ్లు పని చేయనున్నట్లు తెలుస్తుంది.. ఎన్నికల అయిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..ఒకపక్క ఈ ఎన్నికల్లో తమదే గెలుపంటూ ఇరుపక్షాలు సవాళ్ల మీద సవాళ్లు చేసుకుంటున్నారు..Read More

Andhra Pradesh Slider

ప్రశాంత్ కిషోర్ కు సీఎం జగన్ కౌంటర్

ప్రముఖ ఎన్నికల వ్యూహా కర్త అయిన ప్రశాంత్‌ కిషోర్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం..వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహాన్ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున పని చేసిన ఐప్యాక్ టీమ్ సభ్యులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ వైసీపీ కోసం ప్రశాంత్‌ కిషోర్‌ చేసిందేమీ లేదు.. చేసేదంతా ఐప్యాక్ టీమే. ప్రశాంత్‌ కిషోర్‌ మనకు వ్యతిరేకంగా మారారు. ప్రశాంత్‌ కిషోర్‌ కూడా ఊహించని ఫలితాలు వస్తాయి.. గతంలో […]Read More

Slider Telangana

కాంగ్రెస్ పాలనపై రైతన్నలు కన్నెర్ర

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులకు మద్దతుగా గురువారం బీఆర్‌ఎస్‌ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని ఆ పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే… వ్యవసాయానికి కరెంటు, నీళ్లు ఇవ్వకుండా అన్నదాతను ఏడిపించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు పండించిన వడ్లు కొనకుండా గోస పెడుతున్నది. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల బస్తాలు పేరుకుపోయి, వానకు తడుస్తుంటే పట్టించుకోని సర్కారు తీరు చూసి గుండెమండిన అన్నదాతలు బుధవారం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ధాన్యం కొనాలంటూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిరసనలకు దిగారు. […]Read More

Slider Telangana

తెలంగాణ రైతాంగానికి శుభవార్త

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న  రైతులకు సంబంధించి రూ. 2 లక్షల మేరకు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఈరోజు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల రుణమాఫీ కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఈ విషయంలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను […]Read More

Slider Telangana

ఈ నెల18న తెలంగాణ మంత్రివర్గం సమావేశం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి వచ్చే జూన్2వ తేదీ నాటికి  పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. వీటిపై చర్చించడానికి ఈ నెల 18న కేబినేట్ సమావేశం జరగనుంది. షెడ్యూలు 9, షెడ్యూలు 10 లో పేర్కొన్న మేరకు పెండింగ్ లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల అంశాలు, ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీ వంటి అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను […]Read More

Slider Telangana

ఆదాయం పెంచడానికి అధికారులు పక్కా ప్రణాళికలతో పని చేయాలి

తెలంగాణ రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచడానికి అధికారులు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకోసం శాఖల మధ్య సమన్వయం ఉండాలని, పన్నుల ఎగవేత విషయంలో ఎలాంటి లొసుగులు లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్‌లో నిర్ధేశించిన మేరకు రాబడి సాధించడానికి నెలవారి టార్గెట్‌తో పనిచేయాలన్నారు. […]Read More

Slider Telangana

మాజీ సీఎం కేసీఆర్ కు ఈసీ షాక్

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది.. పోరుబాట బస్సు యాత్ర పేరుతో ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల పాటు నిషేధం విధించింది. ఇటీవల సిరిసిల్ల జరిగిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై కేసును సుమోటగా స్వీకరించిన సీఈసీ విచారణ చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.Read More

Andhra Pradesh Slider

వైసీపీకి మరో షాక్

ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ ప్రస్తుత అధికార వైసీపీ పార్టీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల వైసీపీ అధినేత..సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ  సీటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఎమ్మెల్సీ  డొక్కా మాణిక్య వరప్రసాద్.. దీంతో ఆయన కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో సైతం పాల్గొనడం లేదు. ఆయన త్వరలో వైసీపీ రాజీనామా చేసి,టీడీపీ అధినేత.. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ […]Read More

Andhra Pradesh Slider

TDP కి బిగ్ షాక్

ఏపీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష టీడీపీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలో రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డప్పగారి రమేశ్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రేపు బుధవారం ఆయన వైసీపీలో చేరనున్నారు. సీఎం..వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. అయితే రమేశ్ రెడ్డి రాయచోటి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయనకు కాకుండా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అప్పటి […]Read More

Slider Telangana

బీఈడీ, డీఈడీ విద్యార్థులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో శిక్షణ పొందిన బీఈడీ, డీఈడీ విద్యార్థులకు శుభవార్త. డీఎస్సీకి అర్హత సాధించే విధంగా సాధ్యమైనంత తొందరగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గత నెల 29 వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డీఎస్సీ రాయడానికి టెట్‌ తప్పనిసరి కావడంతో మరోసారి పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో […]Read More