ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 21ఎమ్మెల్యే ..2ఎంపీ స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే.. ఈ సందర్భంగా పీఠాపురం ఎమ్మెల్యే జనసేనాని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని మెగాస్టార్ ఇంటికెళ్లి తన తల్లి, అన్న, వదిన కాళ్లు మొక్కి దీవెనలు తీసుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.మీరు ఓ లుక్ వేయండి.Read More
తెలంగాణ రాష్ట్ర సీఎం..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బ తగిలింది. గతంలో రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. మల్కాజిగిరి స్థానంలో గెలవాలని సీఎం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినా కలిసిరాలేదు. ఇక సీఎం సొంత జిల్లా వికారాబాద్లోనూ బీజేపీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సత్తా చాటి గెలుపొందారు.Read More
ఏపీలో ఈరోజు విడుదలైన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఘోర ఓటమిని కట్టబెట్టడంపై వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యా రు. గత ఐదేండ్లలో తమ ప్రభుత్వం తరపున అమ్మఒడి డబ్బులు ఇచ్చి చిన్న పిల్లలకు మంచి చేసినా, అవ్వాతాతలకు ఇంటివద్దకే పెన్షన్ పంపినా ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. కోటి మందికి పైగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినా వారు ఆప్యాయత చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల […]Read More
లోక్ సభ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని చెప్పారు. మళ్లీ త్వరలోనే బీఆర్ఎస్ పుంజుకుంటుదన్న నమ్మకం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన 24 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీకి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీగా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటాన్ని మించిన […]Read More
ఏపీలో ఈ రోజు విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో టీడీపీపార్టీకి చెందిన సీనియర్ నేతలంతా దుమ్ములేపారు. ఇందులో భాగంగా చిలకలూరిపేట నుండి పోటికి దిగిన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు 32,795 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.. మొత్తం 1,09,885 ఓట్లు పుల్లారావు కు నమోదయ్యాయి.మరోవైపు వినుకొండ నుండి బరిలోకి దిగిన మరో సీనియర్ నేత జీవీ ఆంజనేయులుకి 1,29,813 ఓట్లు పోలయ్యాయి.. మొత్తం అంజనేయులుకు 29,683 మెజార్టీ దక్కింది. గురజాల నుండి బరిలోకి దిగిన యరపతినేని […]Read More
ఈరోజు విడుదలైన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈరోజు విడుదలైన ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే. ఓటమికి కారణాలను సమీక్షించుకుంటాం. ఎక్కడ పొరపాట్లు జరిగాయి? ఎలా సరిదిద్దుకోవాలి? ప్రజలను నచ్చని పనులు ఏం చేశాం? అనేది సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తాం’ అని ఆయన తెలిపారు.Read More
ఈరోజు విడుదలైన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎంతలా అంటే ఫ్యాన్ సునామీనే.. వైనాట్ 175 దగ్గర్నుంచి ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్న పరిస్థితి. కేవలం సింగిల్ డిజిట్‌లోనే అభ్యర్థులు గెలుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకూ పట్టుమని పది మంది కూడా గెలవని దుస్థితి వైసీపీకి రావడం గమనార్హం. ఆఖరికి వైఎస్ జగన్ రెడ్డి కంచుకోటగా ఉన్న వైఎస్సార్ కడప జిల్లాలో కూడా కూటమి దెబ్బకు వైసీపీ […]Read More