భారతప్రధానమంత్రిగా మూడోసారి పదవి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ తన తొలి సంతకం పీఎం కిసాన్ నిధుల విడుదలపై చేశారు. ఇందులో భాగంగా 17వ విడత కింద దేశంలోని 9.3 కోట్ల మందికి రూ.20,000 కోట్లు అకౌంట్లలో పడనున్నాయి. రైతుల సంక్షేమం కోసం తమ సర్కారు కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ఈసందర్భంగా తెలిపారు. అందుకే తొలి సంతకం వారికి సంబంధించిన దస్త్రంపై చేశానని, రానున్న రోజుల్లో మరింత సాయం చేస్తామని ఆయన వివరించారు.Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గోండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కి అసమ్మతి సెగ తగిలింది. దాదాపు 14మంది డైరెక్టర్లు చైర్మన్ మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ పద్నాలుగు మంది డైరెక్టర్లు డీసీఓను కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిన తర్వాత నేతలు అధికార పార్టీ కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్న సంగతి తెల్సిందే.Read More
తెలంగాణ మాజీ మంత్రి…సనత్ నగర్ అసెంబ్లీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సోదరుడు, మోండా మార్కెట్ చైర్మన్ తలసాని శంకర్ యాదవ్ తీవ్ర అనారోగ్య సమస్యలతో ఈ రోజు ఉదయం మరణించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో తన సోదరుడి పార్దీవదేహం చూసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కన్నీరు పెట్టారు.మారేడ్ పల్లిలోని శంకర్ యాదవ్ నివాసంలో పార్దీవదేహం కు పలువురు ప్రముఖుల నివాళులు అర్పిస్తున్నారు. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పరామర్శించిన […]Read More
తెలంగాణ రాష్ట్రమాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సోదరులు తలసాని శంకర్ యాదవ్ గారు అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం మరణించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు వారి భౌతిక కాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. బోయిన్ పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా శంకర్ యాదవ్ గారు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు..సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట విషాదం నెలకొన్నది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు.Read More
ఆదివారం కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన తండ్రి ఎర్రన్నాయుడిని ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘నాన్న గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తాను. వారి దీవెనలు ఎల్లప్పుడూ మాపై ఉంటాయి. నా కథకి నువ్వే హీరో నాన్న. పై నుండి నన్ను ఎప్పుడూ మీరు చూస్తుంటారని నాకు తెలుసు’ అని ఓ వీడియోను తన Xలో షేర్ చేశారు. కాగా, తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహాన్ నాయుడు వరుసగా […]Read More
న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్ జట్టుతో ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ఈ విజయంతో టీమిండియా టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టుపై గెలిచిన భారత్ వరల్డ్ కప్ టోర్నిలో ఒకే జట్టు(పాక్)పై అత్యధికసార్లు(7) గెలిచిన జట్టుగా నిలిచింది. బంగ్లాదేశ్పై పాక్, విండీస్ జట్లపై శ్రీలంక చెరో ఆరు విజయాలతో రెండో స్థానంలో ఉన్నాయి. కాగా వన్డే వరల్డ్ కప్ […]Read More
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి 164స్థానాల్లో.. అధికార వైసీపీ పార్టీ పదకొండు స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖరారు అయ్యారు. మరోవైపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఇండియా టుడే వెల్లడించింది. అయితే రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిని తీసుకునేందుకు జనసేనాని తన సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపింది. నిన్న ఆదివారం […]Read More
తెలంగాణలో ఫించన్ దారులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో పైరవీలు చేసి అక్రమంగా పొందిన పింఛన్లను రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో అర్హులందరికీ పింఛన్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని తెలిపారు. సిఫార్సులకు తావు ఉండదని ఆయన స్పష్టం చేశారు. గ్రామసభలు ఏర్పాటు చేసి భూసమస్యలు పరిష్కరించాలని అధికారులను […]Read More