Slider Telangana Videos

ఆధారాలతో మంత్రి స్కాంను బయటపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే-వీడియో

తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వందకోట్ల స్కాంకు పాల్పడినట్లు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కి చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు మంగళవారం ఉదయం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం పెట్టి ఆధారాలతో చెప్పారు. ఆ వీడియో మీకోసంRead More

Andhra Pradesh Slider

ఈ నెల 17నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన నూతన ఎమ్మెల్యేలతో ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశముంది. ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం. 4 రోజుల పాటు కొనసాగే మొదటి సెషన్లో తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. రెండోరోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఇక ఈ భేటీలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.Read More

Slider Telangana

మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు

తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం…. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు పవర్ కమిషన్ నోటీసులు జరీ చేసింది. పక్క రాష్ట్రమైన ఛత్తీస్ గఢ్ రాష్ట్రం నుండి విద్యుత్ కొనుగోలు విషయంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది . అయితే ఒప్పందంపై ఈ నెల 15లోగా మాజీ సీఎం కేసీఆర్ వివరణ ఇవ్వాలని ఆ సమన్లలో పేర్కొంది. కాగా పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జులై 30 వరకు విచారణకు రాలేనని కేసీఆర్  తెలిపారు.Read More

Slider Telangana

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల గురించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేసారు. అయన మీడియా తో మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో విధివిధానాలు రూపొందించినట్లు అయన వెల్లడించారు. ఇందులో భాగంగా త్వరలోనే అర్హులందరికీ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు . మరో 3 నెలల తర్వాత రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. సన్న వడ్లకు క్వింటాకు […]Read More

Slider Telangana

తెలంగాణలో గురుకులాలను ఎత్తేస్తారా..?

తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు పర్యాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దాదాపుగా వెయ్యి కి పైగా గురుకులాలను ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా రవీంద్ర భారతి లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేను.. ప్రధాన మంత్రి నరేందర్ మోడీ… రేపు ఏపీ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వ బడుల్లోనే చదువుకుని ఈ స్థాయికి వచ్చాము. రాష్ట్రంలో […]Read More

Andhra Pradesh Slider

డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  నూతన మంత్రివర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కూటమి గెలవడానికి ప్రధాన కారణమైన పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత గౌరవం తగ్గకుండా మరెవరికీ డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వటం లేదని సమాచారం. జనసేనాని ఒక్కరికే ఈ పదవి కట్టబెట్టనున్నట్లు టాక్. 2014లో టీడీపీ హయాంలో ఇద్దరు, 2019లో వైసీపీ హయాంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలుగా కొనసాగారు. మరోవైపు అటు టీడీపీకి […]Read More

Andhra Pradesh Slider Top News Of Today Videos

తెలుగు తమ్ముళ్లు కాలర్ ఎగరేసుకునే వార్త -వీడియో

ఇది నిజంగా తెలుగు తమ్ముళ్లు తమ కాలర్ ఎగరేసుకునే వార్త. సహజంగా సీఎం స్థాయి వ్యక్తి అందరిలో ప్రత్యేకంగా కన్పించాలని చూస్తారు. కానీ దానికి భిన్నంగా టీడీపీ అధినేత.. రేపు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జరుగుతున్నా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీలో చంద్రబాబు కోసం స్పెషల్ ఛైర్ వేయగా ఆయన దాన్ని మార్పించారు. ఇదే వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ […]Read More

Andhra Pradesh Slider

ఏపీ రాజధానిపై చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీ రాజధాని గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.NDA శాసనసభ పక్ష సమావేశం సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుందని అయన స్పష్టం చేశారు. మరోవైపు ‘విశాఖను ఆర్థిక రాజధాని, ఆధునిక నగరంగా అభివృద్ధి చేసుకుందాము . ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను రాజధానిగా చేస్తానంటే నువ్వు రావొద్దని ప్రజాతీర్పు ఇచ్చిన నగరం విశాఖ. కర్నూలును న్యాయరాజధానిగా చేస్తామని చివరికి […]Read More

Andhra Pradesh National Slider

ఏపీకి కేంద్రం భారీగా నిధులు

దేశ వ్యాప్తంగా రాష్ట్రాల నుండి వసూలు చేసిన రూ.1,39,750 కోట్ల పన్నులను కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేసింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ₹25,066.88 5, బీహార్ రాష్ట్రానికి ₹14056.12 5, మధ్య ప్రదేశకు ₹10,970.44కోట్లను విడుదల చేసింది. మరోవైపు ప.బెంగాల్ కు ₹10,513.46 కోట్లు విడుదలయ్యాయి. ఇక ఏపీకి ₹5655.72 కోట్లు విడుదల చేశారు.. తెలంగాణకు రూ2,937.58 కోట్లు మంజూరయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఇప్పటివరకు రూ.2,79,500 కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్ర […]Read More