Slider Telangana Top News Of Today

పాలనలో అనుభవరాహిత్యం-తెలంగాణలో బదిలీల బంతాట

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం  చేస్తున్న ఐఏఎస్,ఐపీఎస్ అధికారుల బదిలీల గురించి విశ్లేషకులు పాలనలో రేవంత్ అనుభవరాహిత్యంతో పాటు అధికారులకు తలనొప్పులు, ప్రజలకు తిప్పలు!తెలంగాణలో ప్రస్తుత బదిలీలు బంతాటలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.. ఎప్పుడుంటామో, ఎప్పుడు ఊడుతామో తెలియక పనుల మీద అధికారులు  సీరియస్ దృష్టి పెట్టకపోవడంతో రాష్ట్రంలో  పాలన పడకేసి, రాష్ట్రం అధోగతి పాలయ్యే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.. దీనికి కొన్ని ఊదాహరణలు ఊదాహరిస్తున్నారు.. 1) ఐపీఎస్‌ అధికారి ఏవీ […]Read More

Bhakti Slider Top News Of Today

అయోధ్య రామ మందిరం పై కప్పు నుండి వాటర్ లీక్

శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన వర్షం కారణంగా నీరు కారుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం తెలిపారు.. సీజన్లో తొలి వర్షానికే గర్భగుడిలోకి నీరు రావడం.. రామ్ లల్లా ఎదుట పూజారి కూర్చునే చోట లీక్ అవ్వడం, ఆలయ ప్రాంగణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక నీరు నిలిచిపోవడం, ప్రధాన పూజారి గుడికి వెళ్లే పదమూడు రోడ్లూ జలదిగ్బంధంలోనే ఉన్నాయి, ఆ రహదారుల్లోని పలు ఇళ్లలోకి చేరిన మురుగునీరు. అయోధ్యను బీజేపీ ‘అవినీతిహబ్’గా […]Read More

Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి కి కేటీఆర్ లేఖ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. గత పడేండ్లుగా చేతినిండా పనులతో కళ కళ లాడిన చేనేత రంగం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో సంక్షోభం లో కూరుకుపోయిందని కేటీఆర్ విమర్శించారు. గత ప్రభుత్వం చేపట్టిన నేతన్నల కోసం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆపేయాలన్న కాంగ్రెస్ సర్కారు నిర్ణయంతో నేతన్నల జీవితాలు అయోమయంలో పడ్డాయి. ఉపాధి లేక ఆకలి బాధ తట్టుకోలేక చేనేత కార్మికుకులు […]Read More

Slider Telangana Top News Of Today

కేటీఆర్ కు తుమ్మల కౌంటర్

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీ రామారావు సీఎం రేవంత్ రెడ్డి గురించి సీఎం అంటే కటింగ్ మాస్టర్ అని చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. సోమవారం విలేఖర్లతో మాట్లాడుతూ సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు కరెక్టింగ్ మాస్టర్ అని అన్నారు. సంక్షేమం అభివృద్ధి మా ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివి. అర్హులైన పేదలందరికి సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలు అందుతాయి. రుణమాఫీ, రైతుభరోసా అమలుపై బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై […]Read More

Slider Sports Top News Of Today

సెమీస్ కు భారత్

టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. 206 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆసీస్ ఓవర్లన్నీ ఆడి 181/7కే పరిమితమైంది. ఆ జట్టులో ట్రావిస్ హెడ్ (76) ఒంటరి పోరాటం చేశారు. మిచెల్ మార్ష్ (37) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.Read More

Slider Telangana Top News Of Today

కేంద్ర మంత్రి రాజ్ నాథ్ తో సీఎం రేవంత్ భేటీ

హైద‌రాబాద్‌లో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, ఇత‌ర అవ‌స‌రాల‌కు ర‌క్ష‌ణ శాఖ భూములు 2,500 ఎక‌రాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వానికి బ‌దలాయించాల‌ని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారిని ముఖ్య‌మంత్రి రేవంత్ అనుముల గారు విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ర‌క్ష‌ణ శాఖ మంత్రి గారిని క‌లిసి అందుకు సంబంధించిన వివరాలను అందజేశారు. రావిరాల గ్రామంలో తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన 2,462 ఎక‌రాల భూముల‌ను ఇమార‌త్ ప‌రిశోధ‌న కేంద్రం (ఆర్‌సీఐ) ఉప‌యోగించుకుంటున్న విష‌యాన్ని సీఎం గారు ర‌క్ష‌ణ […]Read More

Slider Telangana Top News Of Today

నిరుపేదలకు 25లక్షల ఇండ్లు

2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో బీఎల్‌సీ మోడ‌ల్‌లో తెలంగాణ‌కు 2.70 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయాల‌ని కేంద్ర గృహ‌నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌ గారికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు. నిరుపేద‌లకు వారి సొంత స్థ‌లాల్లో 25 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని […]Read More

Slider Sports Top News Of Today

భారత్ బౌలర్లను ఊచకోత

టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్ లో టీమిండియా విధించిన 206పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్ ఆటగాళ్లు భారత్ బౌలర్లను ఊచకోత కోస్తున్నరు.. ఎనిమిది ఓవర్లకు ఒక వికెట్ ను కోల్పోయి 84పరుగులను చేసింది. ఆసీస్ ఆటగాళ్లలో మార్ష్ 25బంతుల్లో 36 పరుగులు..హెడ్ పంతోమ్మిది బంతుల్లో 41పరుగులతో నాటౌటుగా ఉన్నారు..Read More

Andhra Pradesh Slider Top News Of Today

జనసేన వినూత్న నిర్ణయం

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీల్లో ఒకటైన జనసేన పాలనలో తన మార్క్ చూపించేందుకు   సిద్ధమైంది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ పార్టీ మంత్రులకు కేటాయించిన శాఖలపై ప్రజల నుంచి వినూత్నంగా సలహాలు స్వీకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో  ‘మీలో ఎవరైనా ఈ క్రింది శాఖలకు సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వాలంటే ఈ లింక్ ద్వారా గూగుల్ ఫామ్ ఫిల్ చేయగలరు. ధన్యవాదాలు’ అని పోస్ట్ చేసింది.Read More