ఏపీఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. జనరల్ కేటగిరీలో 80శాతం, వొకేషనల్లో 78శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో పాసైన అభ్యర్థుల మార్కుల మెమోలను జులై 1 నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం పేర్కొంది.Read More
ఆరు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఆరు అబద్ధాలుగా ..ముప్పై వేల కోట్ల అప్పులుగా కొనసాగుతుంది ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలన అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..అధికారంలోకి వస్తే ఆసరా ఫించన్ నాలుగు వేలు ఇస్తాము..ప్రతి మహిళకి రెండు వేల ఐదోందలు ఇస్తాము..ఆడబిడ్డపెండ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం . రైతుబంధు కింద పదిహేను వేలు..రైతుభరోసా కింద పన్నెండు వేలు..డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రుణమాఫీ చేస్తాము..జాబ్ క్యాలెండర్..రెండు లక్షల సర్కారు కొలువులిస్తాము. […]Read More
తెలంగాణ రాష్ట్రంలో గురుకుల అభ్యర్థులకు మద్ధతుగా నిలిచారు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు. ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో ఎక్స్ వేదికగా స్పందిస్తూ “గురుకుల అభ్యర్థుల నిరసనకు మద్దతు ప్రకటిస్తూ అభ్యర్థుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.. రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరం.మంత్రులు, అధికారులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, సీఎం ఇంటి ముందు మోకాళ్ళ మీద […]Read More
తీవ్ర అసంతృప్తిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత..ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డికి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుండి ఫోన్ కాల్ వచ్చింది.. జీవన్ రెడ్డిని తీసుకుని తక్షణమే ఢిల్లీ రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ను ఏఐసీసీ ఆదేశించింది.. దీంతో లక్ష్మణ్ తో కల్సి కాసేపట్లో డిల్లీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెళ్లనున్నారు..జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను చేర్చుకోవడంతో అలకబూనిన జీవన్ రెడ్డి..Read More
నల్లగొండ – శాలిగౌరారం మండలానికి చెందిన ఓ మహిళ భూమి విషయంలో జరిగిన ఘర్షణపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే శాలిగౌరారం ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్ ఆమెను స్టేషన్‌కు పిలిపించారు. రెండు గంటలపాటు అతని చాంబర్లో ఉంచి, అభ్యంతరకరంగా మాట్లాడడంతోపాటు వేధింపులకు గురిచేశాడు.ఈ కేసును పరిష్కరించాలంటే నేను చెప్పినట్లు చేయాలి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. చేపల కూర, చికెన్ వండుకుని తేవాలి. నాకు కావల్సినప్పుడల్లా గ్రీన్ టీ చేసి పెట్టాలి. భర్తకు దూరంగా […]Read More
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ఎం) కింద తెలంగాణకు రావల్సిన బకాయిలు రూ.693.13 కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా జె.పి. నడ్డా గారిని కలిసి వైద్యా ఆరోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక చర్యలను వివరించారు. ఆరోగ్య మిషన్ 2023-24 మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు రూ.323.73 కోట్లు పెండింగ్‌లో ఉండటమే కాకుండా 2024-25 […]Read More
టీమిండియా మాజీ కెప్టెన్.. పరుగుల మిషన్..కింగ్ విరాట్ కోహ్లీ ఓపెనర్ గా ఫెయిలైనట్లే అని ఆర్ధమవుతుంది.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో కోహ్లి తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. విరాట్ కోహ్లీ కి ఓపెనింగ్ కలిసి రావడం లేదనేది క్రికెట్ మరియు కోహ్లీ అభిమానుల వాదన. ఐపీఎల్ లో ఓపెనర్ గా రాణించారు.. కానీ మెగా టోర్నీలో మాత్రం కింగ్ తేలిపోతున్నారని కొందరు అంటున్నారు. ఈ టోర్నీలో విరాట్ 2సార్లు డకౌట్, 2 సార్లు సింగిల్ డిజిట్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జులై మొదటి వారంలో ఉండనున్నట్లు గాంధీభవన్ లో వినికిడి. ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని హైదరాబాద్,రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఒక్కొక్కరిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, వినోద్, రామ్మోహన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్ మంత్రి పదవుల రేసులో ఉన్నట్లు టాక్.ఇటీవల పార్టీపై నిరసన గళం విన్పిస్తున్న […]Read More
ఎన్డీఏ కూటమి స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లా ను ఎంపిక చేశారు ప్రధానమంత్రి నరేందర్ మోదీ.. 61ఏండ్ల ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నికవ్వడం లాంఛనమే.. ఒకవేళ ఎన్నికైతే రెండు సార్లు ఆ పదవిని చేపట్టిన ఐదో వ్యక్తిగా ఆయన నిలుస్తారు.. ఇందులో బలరాం ఝాఖడ్ మాత్రమే పదేండ్ల పదవికాలంలో ఉన్నారు.. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఓం బిర్లా మూడు సార్లు ఎంపీగా గెలిచి లోక్ సభలో అడుగు పెట్టారు.. రాజస్థాన్ కు చెందిన నేత..బీజేపీ […]Read More
కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ జాప్యంపై ప్రభుత్వానికి హైకోర్టు అంక్షితలు
తన నియోజకవర్గమైన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడంలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతుంది. లబ్ధిదారులకు సకాలంలో చెక్కులను అందజేయకపోతే వాటి గడవు ముగిస్తే ఏమి చేస్తారని ..తగిన వివరాలను అందజేయాలని అంక్షితలు వేస్తూ విచారణను బుధవారం రోజుకు వాయిదా వేసింది..Read More