నటుడు మోహాన్ లాల్ ఆగ్రహాం
మలయాళం స్టార్ హీరో మోహాన్ లాల్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్(అమ్మ)అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. మలయాళం చిత్ర పరిశ్రమలో ఫీమేల్ ఆర్టిస్టులపై జరుగుతున్న జరిగిన లైంగింగ వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదిక ఈ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించింది. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ మోహాన్ లాల్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా మోహాన్ లాల్ హేమ నివేదికపై మాట్లాడుతూ “అమ్మ అనేది ఒక ట్రేడ్ యూనియన్ కాదు.. ఒక కుటుంబం లాంటిది. ప్రస్తుతం వస్తోన్న ఆరోపణల దృష్ట్యా కేవలం అమ్మ సంఘాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవద్దు. అమ్మ కమిటికి సంబంధించిన ప్రతి ప్రశ్నకు మొత్తం సినీ పరిశ్రమ సమాధానం చెప్పాలన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి.
ఒక్క చిత్ర పరిశ్రమలోనే కాదు ఎక్కడైన సరే మహిళలను వేధించిన దోషులను ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాలి. అందుకు పోలీసులకు మేము సహాకరిస్తాము. నేను ఏ అధికారక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాదు. పలువురిపై వచ్చిన అరోపణల గురించి దర్యాప్తు జరుగుతోంది. అందర్నీ నిందిస్తూ చిత్ర పరిశ్రమను నాశనం చేయకండి”అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.