రుణమాఫీ అయిన రైతులకు మరో శుభవార్త
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల లక్షన్నర లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసిన సంగతి తెల్సిందే.. ఇప్పటివరకు మొత్తం పన్నెండు వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది..
తాజాగా డిప్యూటీ ముఖ్యమంత్రి.. ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రుణమాఫీ అయిన రైతులకు మరో శుభవార్తను తెలిపారు.. ఖమ్మం మధిర నియోజకవర్గంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి పలు సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవ శంకుస్థాపనల్లో పాల్గొన్నారు..
అనంతరం మధిర క్యాంప్ కార్యాలయంలో బ్యాంకర్లతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ రుణమాఫీ అయిన రైతులందరికి మళ్ళీ రుణాలు ఇవ్వాలి. రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయద్దు. టెక్నీకల్ సమస్యలుంటే పరిష్కరించి రుణాలన్నీ మాఫీ చేయాలని బ్యాంకర్లను ఆయన ఆదేశించారు…