ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో దిగుతున్న డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న డోనాల్డ్ ట్రంప్ పై పెన్సిల్వేనియా ర్యాలీలో ఓ దుండగుడు కాల్పులు జరిపిన సంగతి తెల్సిందే..
అయితే మళ్ళీ అక్కడ నుండే ఎన్నికల ప్రచారం ర్యాలీని నిర్వహిస్తానని డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా డోనాల్డ్ ట్రంప్ మా ప్రియమైన ఫైర్ ఫైటర్ కోరే గౌరవార్ధం నాపై కాల్పులు జరిపిన చోట నుండే ఎన్నికల ప్రచారం ర్యాలీని నిర్వహించబోతున్నాను..
అధ్యక్ష ఎన్నికల్లో కమలా హార్రీస్ గెలిస్తే అతివాద అధ్యక్షురాలిగా చరిత్రలో మిగిలిపోతారు అని రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. కమలా హార్రీస్ ప్రజల్లో ఆధరణను కోల్పోయారు. దేశ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదు అని అయన అన్నారు..