బీఆర్ఎస్ ను లేకుండా చేసే కుట్ర -ఎడిటోరియల్ కాలమ్

 బీఆర్ఎస్ ను లేకుండా చేసే కుట్ర -ఎడిటోరియల్ కాలమ్

Ex CM KCR

తెలంగాణను తెచ్చిన పార్టీ… తెచ్చిన తెలంగాణను పదేండ్లలోనే దేశానికే ఆదర్శంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్. అలాంటి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కుట్రలు జరుగుతున్నాయా..?. పక్క రాష్ట్రమైన ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగల్లో ఇది అంతా జరుగుతుందా ..?. అందులో భాగంగానే బీఆర్ఎస్ కు చెందిన టీడీపీ పూర్వపు నేతలైన తాజా మాజీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారా.?.. కాంగ్రెస్ లో చేరాలని బీఆర్ఎస్ నేతలకు.. ఎమ్మెల్యే..ఎమ్మెల్సీ.మాజీలకు అమరావతి వేదికగా సంప్రదింపులు జరుగుతున్నాయా అంటే..?. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చూసి అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ప్రజలు… ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ,బీజేపీలకు చెరో ఎనిమిది ఎంపీ స్థానాలను కట్టబెట్టారు. అంతేకాకుండా పదిహేడు చోట్ల బరిలోకి దిగిన బీఆర్ఎస్ కు పన్నెండు చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు.. అయితే ఎమ్మెల్యే. ఎంపీ ఎన్నికల్లో టీడీపీ పోటి చేయకుండా కాంగ్రెస్ కు మద్ధతు ఇవ్వడం వల్లనే తాము అధికారంలోకి వచ్చాము.. ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుపొందామని సాక్షాత్తు ముఖ్యమంత్రి… కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు వ్యాఖ్యానించిన సంగతి కూడా తెల్సిందే. అయితే ఇక్కడే బీఆర్ఎస్ ను లేకుండా చేయాలని కేవలం కాంగ్రెస్,బీజేపీ ,టీడీపీ,జనసేన మిత్రపక్షాలు ఉండాలన్నదే టీడీపీ చీఫ్ ఆలోచన అన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

అందుకే బీఆర్ఎస్ లో ఉన్న టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి,ప్రకాష్ గౌడ్,అరికెలపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి లాంటి నేతలను కాంగ్రెస్ లో చేరేవిధంగా బాబు చక్రం తిప్పినట్లు ఆర్ధమవుతుంది. అందుకే ముందు టీడీపీ చీఫ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కల్సి ఆ తర్వాత రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీళ్ళే కాకుండా బీఆర్ఎస్ లో ఉన్న టీడీపీ అనవాళ్లు ఉన్న ఎమ్మెల్యేలను.. మాజీ మంత్రులను కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి వ్యూహారచనలు జరుగుతున్నాయని తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లో హాట్ టాపిక్. ఈ నెల ఇరవై మూడో తారీఖు నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ముందే ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని ..టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎల్పీ లేకుండా చేస్తామని … ఆ ఎల్పీను తమ పార్టీలో వీలినం చేసుకుంటాము.. ఆ పార్టీ భవిష్యత్తే ఉండదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య,దానం నాగేందర్ లతో పాటు మంత్రులు చేసిన వ్యాఖ్యలు మీడియాలో మనం చూశాము.

అయితే రాజునుకొట్టాలంటే ముందు సైన్యాన్ని కొట్టాలనే సిద్ధాంతాన్ని నమ్మిన బాబు బీఆర్ఎస్ కు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే,,ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులను సైతం చేర్చుకుని బీఆర్ఎస్ ను బలహీనపరిచి త్వరలో జరగబోయే స్థానిక ,పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ మిత్రపక్షాలుగా బరిలోకి దిగాలని ఆయన వ్యూహాంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలంతా వెళ్లిన కానీ యువతరానికి.. కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వచ్చేన్నికల్లో సత్తా చాటుతాము అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.. మాజీ మంత్రులు హారీష్ రావు,కేటీఆర్ లు చెబుతున్న కానీ ఆ పార్టీ నుండి వలసలు కొంచెం ఇబ్బందికరంగా ఉండటం సహాజం.. స్థానిక పంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీకి పట్టం కట్టిన కానీ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపే ప్రజలు చూస్తారు.. అబద్ధపు అలవికానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై ప్రజల్లో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత మొదలైంది.. ప్రజలు చీదరించుకుంటున్నారు. తిరిగి మనం పుంజుకునే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి అని పలు సమీక్ష సమావేశాల్లో గులాబీ బాస్ మనోధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమాన్ని నీరుగార్చాలని కుట్రలు చేస్తూ నాడు ఇదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలను. నేతలను చేర్చుకున్న కానీ రాష్ట్రాన్ని సాధించి రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. అలాంటి పార్టీని లేకుండా చేయాలని ఎన్ని కుట్రలు చేసిన కానీ తమ ఆస్థిత్వాన్ని కాపాడే పార్టీ బీఆర్ఎస్ అని ప్రజలు భావిస్తే అలా కుట్రలు చేసే పార్టీల అడ్రస్ గల్లంతయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.. గతంలో విభజన అనంతరం తెలంగాణలో వ్రేలు పెట్టాలని చూసిన బాబును నాటి సీఎం కేసీఆర్ ఆంధ్రాకు పోయేలా చేశారు.. ఇప్పుడు వ్రేలు పెడితే రాబోవు రోజుల్లో మళ్లీ ఇక ఇటువైపు చూడకుండా ఉండేలా తెలంగాణ సమాజం చేయడం ఖాయమని కూడా గులాబీ శ్రేణులు అనుకుంటున్నారు. అయితే కుట్రలు కుతంత్రాలు ఆ పార్టీకి కొత్త కాదు. వాటిని ముందే పసిగట్టి పార్టీని తెలంగాణను కాపాడుకునే సత్తా కేసీఆర్ కు ఉందని పొలిటికల్ క్రిటిక్స్ టాక్. చూడాలి మరి మున్ముందు ఏమి జరుగుతుందో..?

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *