విత్తనాల కరువుతో ఆందోళనలో రైతులు
ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ సాగు సమయం వచ్చినప్పటికీ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రతీ ఏడాది ఖరీఫ్ సాగు ప్రారంభానికి ముందే వ్యవసాయశాఖ ద్వారా ప్రభుత్వం రైతులకు విత్తనాలను పంపిణీ చేసేది.
కాగా ఈ ఏడాది రైతులు సాగుకు శ్రీకారం చుట్టి నెలరోజులు కావస్తున్నా ఇప్పటి వరకు విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.