పల్నాడులో దుమ్ము లేపిన టీడీపీ
ఏపీలో ఈ రోజు విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో టీడీపీపార్టీకి చెందిన సీనియర్ నేతలంతా దుమ్ములేపారు.
ఇందులో భాగంగా చిలకలూరిపేట నుండి పోటికి దిగిన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు 32,795 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు..
మొత్తం 1,09,885 ఓట్లు పుల్లారావు కు నమోదయ్యాయి.మరోవైపు వినుకొండ నుండి బరిలోకి దిగిన మరో సీనియర్ నేత జీవీ ఆంజనేయులుకి 1,29,813 ఓట్లు పోలయ్యాయి..
మొత్తం అంజనేయులుకు 29,683 మెజార్టీ దక్కింది. గురజాల నుండి బరిలోకి దిగిన యరపతినేని శ్రీనివాస్ 29,100 మెజార్టీతో నెగ్గారు. ఆయనకు ఈ ఎన్నికల్లో 1,02,396 ఓట్లు పడ్డాయి.