BRS లోకి చేరికలు
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలోని పరకాల పట్టణంలోని 5వ డివిజన్ కి చెందిన మోరె రాజేందర్ కాంగ్రెస్ పార్టీని వీడి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో తిరిగి బి.ఆర్.ఎస్.లో చేరారు.
వారికి గులాబీ కండువా కప్పి చల్లా ధర్మారెడ్డి గారు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.పార్టీలో చేరిన రాజేందర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ఆ పార్టీలో చేరి తప్పుచేసానన్నారు.కాంగ్రెస్ పార్టీ విధానాలు,పాలన నచ్చకనే తిరిగి బి.ఆర్.ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,బి.ఆర్.ఎస్ నాయకులు,కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.