ప్రజా వీరుడు పండుగ సాయన్న జయంతి ని తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిద్దాం – తీన్మార్ మల్లన్న

తెలంగాణ ప్రజా ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయ నాయకుడైన ప్రజా వీరుడు పండుగ సాయన్న గారి జయంతి (ఆగస్ట్ 08) సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారు పిలుపునిచ్చారు.
తీన్మార్ మల్లన్న గారి అధికారిక మీడియా వేదిక అయిన “తీన్మార్ మల్లన్న యూట్యూబ్ ఛానల్” ద్వారా ఈ పిలుపును వెలువరించారు. పండుగ సాయన్న గారి త్యాగాలను, స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని గుర్తుచేసుకోవడమే కాకుండా, యువతకు ఆయన ఆశయాలను చాటిచెప్పే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ –“పండుగ సాయన్న ఒక వ్యక్తి కాదు… ఒక ఉద్యమం. ఆయన పోరాట పంథా, బహుజన ఆత్మగౌరవానికి నిలువెత్తు ఉదాహరణ. ప్రతి జిల్లా కేంద్రంలో, మండల స్థాయిలో, విద్యార్థి వర్గాలు, బహుజన సంఘాలు, బీసీ సంఘాలు సమిష్టిగా జయంతి వేడుకలను జరపాలి” అని పేర్కొన్నారు. జయంతి కార్యక్రమాల షెడ్యూల్, పోస్టర్లు త్వరలో విడుదల చేయనున్నారు.