ఎవడు రమ్మన్నడు మిమ్మల్నంటూ- రైతులపై మంత్రి చిందులు..!

Komatireddy Venkat Reddy Minister Of Telangana
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో జాతీయ రహ దారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాల్సిన స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోటితో దురుసుగా ప్రవర్తించాడు.., నోరుపారే సుకుని అవమానించాడని రహదారి నిర్మాణ బాధిత రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరెల్లి నుంచి ఛత్తీస్ గఢ్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదా రిలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం, వర్కట్పల్లి, పొద్దటూరు, ఏదుళ్లగూడెం, రెడ్లరేపాక, దాసిరెడ్డిగూడెం, మల్లేపల్లి, లోతుకుంట గ్రామాల రైతులు భూములను కోల్పోతున్నారు.
రోడ్డు నిర్మాణం కోసం ఆయా భూముల్లో అధికారులు మార్కింగ్ చేశారు. కోట్ల విలువైన భూము లను కోల్పోతున్న మల్లేపల్లి రైతులు తమకు న్యాయం చేయాలని బుధవారం హైదరాబా ద్ లోని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి నివాసానికి వెళ్లారు. మంత్రి వారి గోడు వినకుండానే అడ్డగోలుగా మాట్లా డినట్టు రైతులు వాపోతున్నారు. ‘ఎందుకొ చ్చిండ్రు. ఎవడు రమ్మన్నడు మిమ్మల్ని. మీ ఎమ్మెల్యేను తీసుకొని రాపోండ్రి’ అంటూ గద మాయించాడని భువనగిరిలో వారు మీడి యా ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు.
