మహాశివ రాత్రి ఏర్పాట్లపై మంత్రి సురేఖ సమీక్ష.!

Konda Surekha
తెలంగాణ రాష్ట్రంలోని శివాలయాల్లో మహాశివరాత్రి ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈవోలతో మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశo నిర్వహించారు.
ఈనెలలో జరగనున్న మహాశివ రాత్రి పర్వదిన పండుగ సందర్భంగా ఎదురయ్యే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, భద్రకాళి తదితర దేవస్థానాల్లో అవసరమైన ఏర్పాట్లపై ఆరా తీశారు..
గత ఏడాది అనుభవాల ఆధారంగా ఈ ఏడాది చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ సంబంధితాధికారులకు సూచించారు.