ప్రైవేట్ వీడియోల పై హీరో నిఖిల్ స్పందన..!

ప్రైవేట్ వీడియోల వ్యవహారంలో లావణ్య అనే యువతి తన పేరు ప్రస్తావించడాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యువహీరో నిఖిల్ ఖండించారు.
ఆయన మాట్లాడుతూ తన గురించి వస్తున్న ఆ వీడియోలు ‘కార్తికేయ 2’ సక్సెస్ మీట్ అనంతరం జరిగిన డిన్నర్ పార్టీలోనివి అని క్లారిటీచ్చారు.
తన కుటుంబ సభ్యులతో ఉన్న వీడియోలను తప్పుగా చూపిస్తున్నారు.. నిజానిజాలు పోలీసులకు కూడా తెలుసని నిఖిల్ స్పష్టం చేశారు..మరోవైపు ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖుల వీడియోలు సైతం ఉన్నట్లు తెలుస్తుంది.
