ఇంటికి వెళ్ళే దారినే దోచేసిన సబ్ రిజిస్ట్రార్…
![ఇంటికి వెళ్ళే దారినే దోచేసిన సబ్ రిజిస్ట్రార్…](https://www.singidi.com/wp-content/uploads/2025/02/images-2.jpeg)
సింగిడి న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన పండుగ రామస్వామి తండ్రి పోచయ్య అను అతడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు తన తండ్రి అయిన పండగ పోచయ్య 1979 వ సంవత్సరంలో చిట్టినేని మురళీధర్ రావు వద్ద నుండి కొనుగోలు చేసిన 246/ఏ పట్ట నెంబర్ గల భూమిలో 40 సంవత్సరాల క్రితం రామస్వామి, సుధాకర్, నరసయ్య, వెంకటస్వామి అను అన్నదమ్ములు ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఇంటి ముందు నుంచి మెయిన్ రోడ్డు వరకు తమ సొంత భూమి రెండు గజాలు త్రోవ ఉన్నది.
ఆ త్రోవ నుండి చేర్ల భాస్కర్ మరియు తన కుమారులు చేర్ల సురేంద్రబాబు, వెంకటేష్ కుటుంబ సభ్యులు కూడా ఆ త్రోవగుండ నడిచేవారు. కానీ గత సంవత్సరం నుండి చేర్ల భాస్కర్ తన కుమారుడు సురేంద్రబాబు సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్నాడు. ఆయన అండదండలతో ఆ త్రోవ మాది అంటూ రామస్వామి కుటుంబ సభ్యులను ఆ త్రోవ నుండి నడవకుండా ఇనుప గేటు పెట్టి త్రోవను ఆక్రమించి రాకుండా చేస్తూ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ చంపుతానని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
అట్టి చేర్ల భాస్కర్ తన కుమారులు చేర్ల సురేంద్రబాబు సబ్ రిజిస్ట్రార్, చేర్ల వెంకటేష్ లపై తగు చర్య తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసు వారిని ఆశ్రయించడం జరిగింది. ఇట్టి ఫిర్యాదు పై ఎస్సై ప్రశాంత్ రెడ్డి కేసు నమోదు చేశారు.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)