రేవంత్ రెడ్డి కి సినీ ఇండస్ట్రీ కౌంటర్..?
తెలంగాణలో కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పాటై,రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సినీ ఇండస్ట్రీతో వరుస వివాదాలు తలెత్తాయి..నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత,అల్లు అర్జున్ అరెస్ట్,అసెంబ్లీ సాక్షిగా ఇండస్జ్రీపై ముఖ్యమంత్రి విమర్శలు ఇలా ఏడాదంతా వివాదాలతోనే నడించింది.
అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.అయితే ” గద్దర్ అవార్డ్స్ “కి కౌంటర్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.ఇకపై ప్రతి సంవత్సరం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్వయంగా అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది..
ఫిబ్రవరి 6 తెలుగు సినిమా పుట్టిన రోజున ప్రతి సవత్సరం వేడుకలు జరపాలని, ఆ వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు..ఆ రోజు నటీ నటులు, నిర్మాతలు, ఇండస్ట్రీ వ్యక్తులు తమ ఇంటిపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని నిర్ణయించారు..జెండా రూపకల్పన బాధ్యతను పరిచూరి గోపాలకృష్ణకు అప్పగించినట్లు సమాచారం..