ఎన్టీఆర్ ను మించిన నటుడు చంద్రబాబు..!
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నటనలో దివంగత మాజీ సీఎం.. ప్రఖ్యాత నటుడు ఎన్టీఆర్ ను మించిపోయారని వైసీపీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి విమర్శించారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు పొరపాటున ఓటు వేసి చంద్రముఖిని నిద్రలేపారని అన్నారు. 9 నెలల పాలన తర్వాత బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీగా మారిందని జగన్ బాబును దుయ్య బట్టారు.
చీటింగ్ లో చంద్రబాబు పీహెచ్ఎ చేశారు.. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమేనని చెప్పారు. సీబీఎన్ మోసాలను, అబద్ధాలను ప్రజలకు వివరిస్తామని జగన్ తెలిపారు.