Cancel Preloader

చేసిన తప్పే పదే పదే చేస్తున్న రేవంత్ సర్కారు..?

 చేసిన తప్పే పదే పదే చేస్తున్న రేవంత్ సర్కారు..?

సహాజంగా ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఎవరైన ఇంకో అబద్ధమే చెప్తారు అనేది నానుడి. ఇదే అంశాన్ని ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనునయిస్తే సంధ్య థియోటర్ సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకుని ఇటు ప్రజలను అటు మీడియాను డైవర్షన్ చేయచ్చు అని కావోచ్చు అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఇష్యూను ఎత్తుకున్నట్లు అన్పిస్తుంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలపై వారి దృష్టిని పక్కకు మళ్ళించడానికి కొన్నాళ్లు కాళేశ్వరం అవినీతి అంశాన్ని ముందరేసుకున్నారు. ఆ తర్వాత మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని ముంగట పెట్టుకున్నారు.. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని టామ్ టామ్ చేశారు.. ఆ తర్వాత హైడ్రా వ్యవస్థను తెరపైకి తెచ్చారు. ఇవన్నీ బెడిసికొట్టడంతో ఏకంగా ఫార్ముల కారు ఈ రేస్ ను ఎత్తుకున్నారు.

ఈ సంఘటనలో హైకోర్టులో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అనుకూలంగా తీర్పు రావడంతో వెతకబోయిన తీగ కాళ్లకే తగిలినట్లుగా సరిగ్గా అదే టైం కు పుష్ప మూవీ విడుదల కావడం.. సంధ్య థియోటర్ దగ్గర తొక్కిసలాట జరగడం.. రేవతి అనే మహిళ మృతి చెందటం.. శ్రీతేజ్ అనే బాలుడు ఆసుపత్రి పాలవ్వడం ఒకదాని తర్వాత ఒకటి కల్సి వచ్చే అంశంగా అధికార కాంగ్రెస్ పార్టీకి దొరికినట్లైంది. అంతే ఇక ఉన్నఫలంగా అప్పటివరకు థియోటర్ యాజమాన్యం పై చర్యలు తీస్కున్న ప్రభుత్వం ఆ తర్వాత ఏకంగా హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి పద్నాలుగు రోజుల రిమాండ్ కు జైలుకి కూడా తరలించారు. అప్పటికే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడంతో బన్నీకి మధ్యంతర బెయిల్ వచ్చింది.. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు తెల్సిందే.

ఇవన్నీ పక్కనెడితే తాజాగా ప్రభుత్వ పెద్దలకు తెల్సా.. తెలియకుండా కానీ పోలీసు విభాగం వాళ్లు అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందింది.ఆ సంఘటనకు బన్నీకు ఎలాంటి సంబంధం లేదని వైరల్ అవుతున్న ఓ వీడియో గురించి వార్నింగ్ ఇస్తూ ఓ పోస్టు పెట్టడం చేసిన తప్పే పదే పదే చేస్తున్నట్లుగా రేవంత్ సర్కారుపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ అంశాన్ని పక్కనెడితే బయట వైరల్ అవుతున్న వీడియోలో స్పష్టంగా టైం డేట్ ఉంది.. పోలీసు వ్యవస్థ కోర్టుకు సమర్పించిన వీడియోలో టైం లేదు.. అయితే కావాలనే ఇలా టైం లేని వీడియోలు విడుదల చేశారు అని విమర్శలు విన్పిస్తున్నాయి.

గత ఆరు నెలలుగా గురుకులాల్లో ఏడాదిగా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగంతో పాటు అన్ని వర్గాలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు.. సమస్యలతో పాటు హామీల అమల్లో వైపల్యం కప్పిపుచ్చుకోవడానికి ఏదోక అంశాన్ని తెరపైకి తెస్తున్న సర్కారుకు తాజా అల్లు ఇష్యూ మాత్రం మేలుకోలుపులాంటిదే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ సంఘటనపై సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అసెంబ్లీలో ఏకదాటిగా రెండు గంటల పాటు అసెంబ్లీలో చర్చించడానికి సమయం ఉంటుంది . కానీ ఏడాదిగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించడానికి టైం ఉండదా అని అన్ని వర్గాల నుండి విన్పిస్తున్న టాక్. అప్పటికే ప్రధాన ప్రతిపక్ష ఇటు రైతాంగం గురించి.. గురుకులాల అంశం గురించి.. ఫార్ముల కారు ఈ రేస్ గురించి చర్చించాలని నోటీసులు ఇచ్చిన కానీ తోసిపుచ్చిన ప్రభుత్వం ఏకంగా ఎంఐఎం తో కల్సి అల్లు అర్జున్ గురించి చర్చించారు.

అసెంబ్లీ వెలుపల అయితే కింది స్థాయి నాయకుల దగ్గర నుండి మంత్రుల వరకు వాళ్లకు వేరే పని ఏమి లేదన్నట్లు అల్లు అర్జున్ సంఘటన గురించే మీడియా ముందు తెగ మాట్లాడేస్తున్నారు. ప్రజల సమస్యల కంటే అల్లు అర్జున్ సమస్యనే ముఖ్యమైందని ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ నేతలు విమర్శిస్తున్నారంటే అధికార పార్టీ ఫోకస్ ఎంతగా ఉందో ఆర్ధమవుతుంది. ఈ వ్యవహారం మొత్తంగా పరిశీలిస్తే ఇచ్చిన హామీలను పక్కకు పెట్టడానికి.. ప్రజలను సమస్యలపై డైవర్ట్ చేయడానికి అప్పటికప్పుడు సరికొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నారు.. ఆ అంశాన్ని సమర్ధించుకోవడానికి అధికార పార్టీ నేతలు పడుతున్న పాట్లతో చేసిన తప్పే పదే పదే రేవంత్ సర్కారు చేస్తుందని అన్ని వర్గాల నుండి విమర్శల వర్షం కురుస్తుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *