NTR అభిమానులకు శుభవార్త..!
Tollywood : ఇటీవల విడుదలైన దేవర మూవీ హిట్ తో మంచి జోష్ లో ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నుండి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. దేవర మూవీకి సీక్వెల్ గా తెరకెక్కనున్న దేవర పార్ట్ -2 మూవీకి సంబంధించి స్క్రిప్ట్ పనులు ప్రారంభమయ్యాయి అని సినీ వర్గాలు తెలిపాయి.
స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు దర్శకుడు కొరటాల శివ ,తన టీమ్ గత కొన్ని వారాలుగా దీనిపై వర్క్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి.
వచ్చేడాది షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. తాజాగా వార్ -2 సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేసే సినిమాపై దృష్టి పెట్టనున్నట్లు టాక్.