శ్రీలీల కీలక నిర్ణయం..?

 శ్రీలీల కీలక నిర్ణయం..?

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించి ఇటీవల పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప -2 లో  కిస్సిక్’ అనే ఐటెం సాంగ్ తో మెరిసిన స్టార్ హీరోయిన్ శ్రీలీల..

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ  కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఐటమ్ సాంగకు నో చెప్పాలని ఈ హాట్ బ్యూటీ డిసైడ్ అయినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’లోనూ ఐటం సాంగ్ ఆఫర్ రాగా ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. పుష్ప-2కు ఉన్న క్రేజ్, పుష్పలో సమంత ఐటమ్ సాంగ్ హిట్ కావడంతో ‘కిస్సిక్’ సాంగ్ కు తాను ఒప్పుకున్నట్లు సమాచారం. మరోవైపు ఈ నెల 25న ఆమె నటించిన ‘రాబిన్ హుడ్’ మూవీ విడుదల కానుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *