బాబు కళ్ళల్లో ఆనందం కోసం షర్మిల కన్నీళ్లు
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలది ఆస్తి తగాదా కాదు అధికార తగాదా’ అని వైసీపీ సీనియర్ నేత.. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శించారు.
‘ఆమె ప్రెస్మెట్ పెట్టి తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికని ఆయన చెప్పారు. కానీ ఆ ప్రెస్మీట్ చంద్రబాబు కోసం పెట్టింది. ఆయన కళ్లలో ఆనందం చూసేందుకే ఆమె మీడియా ముందుకొచ్చారు.
గత కొంతకాలంగా మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని తిట్టేందుకే ప్రత్యేకంగా ప్రెస్మీట్లు పెడుతున్నారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావొద్దనే ఆమె పని చేస్తున్నారు’ అని మీడియాతో ఆయన అన్నారు.