కేసీఆర్ పై బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్కు దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని బీజేపీ నేతృత్వంలో ధర్నా జరుగుతున్న సంగతి తెల్సిందే.
ఈ ధర్నాలో పాల్గోన్న ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ” కేసీఆర్ కు ఈ ఎన్నికల్లో పొరగాళ్ళు ఎవరూ ఓట్లు వేయలేదు.. వచ్చే ఎన్నికల నాటికి ఎనబై ఏళ్ళు ఉంటాయి. అప్పటికి ఉంటడో.. ఉండడో తెలియదంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
పదేండ్ల పాలనలో తెలంగాణను కేసీఆర్ ఆగమాగం చేసిండు.. అందుకే గత ఎన్నికల్లో ఓట్లు వేయలేదు. ఆయన బిడ్డలైన కేటీఆర్,కవితలకు ఎవరైన ఓట్లు వేస్తారా అని ఆయన ప్రశ్నించారు.