కంప్యూటర్ సృష్టికర్త చార్లెస్ బాబేజ్ కాదా…? రాహుల్ గాంధీ నా..?
డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఎదురుగా దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” కేటీఆర్ అమెరికాలో కంప్యూటర్ చదువుకున్నాను అని చెబుతున్నాను. కంప్యూటర్ చదువుకున్న ట్విట్టర్ పిట్ట ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నాడు.
అసలు కంప్యూటర్ కనిపెట్టిందే రాజీవ్ గాంధీ.. ఈ దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ.. రాజీవ్ గాంధీ లేకపోతే కేటీఆర్ గుంటూరులో ఇడ్లీ వడలు అమ్ముకునేవాడు.. సిద్ధిపేట రైల్వే స్టేషన్లో చాయ్ లు అమ్ముకునేవాడు అని హేద్దేవ చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. అసలు కంప్యూటర్ కనిపెట్టిందే చార్లెస్ బాబేజ్…
ఈ మధ్యలో ఈ రాజీవ్ గాంధీ ఎక్కడ నుండి వచ్చాడు. ఈ దేశానికి కంప్యూటర్ వచ్చింది రాజీవ్ గాంధీ యుగంలో కావోచ్చు కానీ కంప్యూటర్ కనిపెట్టింది చార్లెస్ బాబేజ్ కదా.. రోజూ అబద్ధాలాడే ముఖ్యమంత్రి ఈరోజు కూడా అబద్ధాలను చెబుతున్నాడు.. బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్న సమయంలో విచక్షణ తప్పి ఫేక్ ముచ్చట్లు చెబుతున్నారు. ఇంకా తీరు మార్చుకోవడం లేదు అని వారు ట్రోల్స్ చేస్తున్నారు.