గర్భిణీ మహిళలు తీసుకోవాల్సిన ఆహరం ఇదే…?
గర్భిణీ మహిళలు ముఖ్యంగా ఆహారం విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. ప్రొటీన్, పీచు, ఆరోగ్య కరమైన కొవ్వులుండే పళ్లు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆహారంతో పలు ఉపయోగాలుంటాయని వారు చెబుతున్నారు.
గర్భస్థ శిశువు ఎదుగుదల—బరువు, తల్లి ఆరోగ్య సంరక్షణ, పోషణ లోప నివారణ, సుఖ ప్రసవం, ప్రసవానంతర రికవరీ వంటి విషయాల్లో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనేది నిపుణుల మాట.