బీసీ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి…
![బీసీ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి…](https://www.singidi.com/wp-content/uploads/2025/02/FB_IMG_1738862103572-720x560.jpg)
సింగిడి న్యూస్: మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రం బీసీ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆరాధ్య అనుమానాస్పద మృతి.
కల్వకుర్తికి చెందిన ఆరాధ్య ఉదయం క్లాస్ రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్తున్న ఉపాధ్యాయులు.
ఫోన్ చేసి ఫిట్స్ వచ్చాయని చెప్పారు కానీ ఇక్కడికి వచ్చాక మా పాప ఉరివేసుకుందని చెప్తున్నారు అంటూ తల్లిందండ్రుల ఆవేదన.
మా పాప ఉరి వేసుకున్న ఆనవాళ్లు లేవు.. ఉపాధ్యాయులు అబద్ధం చెప్తున్నారు అంటూ మండిపడ్డ తల్లిదండ్రులు…
మృతదేహం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
చదువు రాదు, పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతావు అంటూ ఉపాధ్యాయులు అనడంతో అవమాన భారంతో చనిపోయిందని సమాచారం.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)