రాప్తాడులో ప్రకాష్ రెడ్డే తోపు.. సులభంగా విజయం సాధించనున్న వైసీపీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది.. ప్రధాన పార్టీలన్నీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్నాయి.. ముఖ్యంగా కొన్ని సెగ్మెంట్లలో మాత్రం గెలుపు ఎవరిది అన్నట్టుగా హారహోరీ పోరు జరగబోతోంది. రాష్ట్రంలోని అత్యంత వివాదాస్పద అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల్లో ఒకటైన అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడులో మాజీ మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తలపడబోతున్నారు.. పరిటాల శ్రీరామ్ టికెట్ ఆశించినప్పటికీ టిడిపి అధిష్టానం అతనికి టికెట్ ఇవ్వకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై తల్లి, కొడుకులు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. గత ఐదేళ్ల జగన్ సంక్షేమ పాలన, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మృదుస్వభావం, సొంత నిధులతో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని ధీమాతో ప్రజా ఆశీర్వాదం కోసం తోపుదుర్తి బయలుదేరుతుంటే.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, నియోజకవర్గంలో అభివృద్ధి లేదనే నినాదంతో పరిటాల సునీత ప్రచారం చేస్తున్నారు. గత టిడిపి పాలనలో రాప్తాడులో శ్రీరామ్ అనుచరులు సృష్టించిన మారణహోమాన్ని ప్రజలు ఇంకా గుర్తుంచుకున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ఐదేళ్ల కాలంలో ఒక ఫ్యాక్షన్ హత్యగాని, శాంతిభద్రతల సమస్యగాని ఏ విధమైన గొడవలు జరగకపోవడంతో మరోసారి తోపుదుర్తికి నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టే అవకాశం కనిపిస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రతిష్టాత్మక సిద్ధం సభల్లో ఒకటి రాప్తాడులో నిర్వహించడం ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపింది. తోపుదుర్తి సేవా కార్యక్రమాలతో పాటు వ్యక్తిగతంగా ఆయనకున్న ఇమేజ్ కారణంగా మరోసారి తోపుదుర్తి విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.